బోరబండలో ఉద్రిక్తత : బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట
హైదరాబాద్, 11 నవంబర్ (హి.స.) జూబ్లీహిల్స్ బై పోల్ సందర్భంగా బోరబండలో ఉద్రిక్తత నెలకొంది. శ్రీనగర్ కాలనీలోని 276 పోలింగ్ బూత్ లోకి కాంగ్రెస్ నాయకుడు బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ కండువాతో రావడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఆయన
బోరబండలో ఉద్రిక్తత


హైదరాబాద్, 11 నవంబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ బై పోల్ సందర్భంగా బోరబండలో ఉద్రిక్తత నెలకొంది. శ్రీనగర్ కాలనీలోని 276 పోలింగ్ బూత్ లోకి కాంగ్రెస్ నాయకుడు బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ కండువాతో రావడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఆయన వారిపై దాడి చేయడంతో తోపులాట జరిగింది. రహ్మత్ నగర్ లో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అనుచరులతో హల్ చేశారు. ఆయన ప్రచారం చేస్తుండడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande