దిగి వస్తున్న బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతంటే..
ముంబై, 13 నవంబర్ (హి.స.)బంగారం కొనుగోలు చేయాలని అందరికీ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో పసిడి రేట్లు ఆకాశాన్ని అంటాయి. బంగారమే కాదు.. వెండి కూడా పరుగులు పెడుతోంది. ఎలక్ట్రికల్‌ వాహనాలతో పాటు ఇతర పరికరాలలో వెండిని ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో ఈ మధ్య కాలం న
gold


ముంబై, 13 నవంబర్ (హి.స.)బంగారం కొనుగోలు చేయాలని అందరికీ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో పసిడి రేట్లు ఆకాశాన్ని అంటాయి. బంగారమే కాదు.. వెండి కూడా పరుగులు పెడుతోంది. ఎలక్ట్రికల్‌ వాహనాలతో పాటు ఇతర పరికరాలలో వెండిని ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో ఈ మధ్య కాలం నుంచి వెండికి భారీ డిమాండ్‌ పెరిగింది. బంగారం లాగే వెండి కూడా పరుగులు పెడుతోంది. భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు తర్వాత మళ్లీ తగ్గుతూ వస్తున్నాయి. కొంత మేరకు తగ్గాయి. అయితే గత రెండు రోజులుగా పసిడి రేటు మళ్లీ పరుగులు పెట్టింది. అయితే ఈ రోజు మాత్రం గోల్డ్ రేటు మళ్లీ పడిపోయింది. ఇది సానుకూల అంశం అని అనుకోవచ్చు.

నిన్న హైదరాబాద్‌లో బంగారం ధరను చూస్తే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 మేర పడిపోయింది. ఈరోజు ప్రస్తుతం బంగారం ధర రూ.1,25,550 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,040 వద్ద ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande