అఫ్గానిస్థాన్‌లో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతగా నమోదు
కాబుల్, 13 నవంబర్ (హి.స.) అఫ్గానిస్థాన్‌ (Afghanistan)లో మరోసారి భూకంపం సంభవించింది. అయితే, భూ ప్రకంపనలు రిక్టర్ స్కేలు (Richter Scale)పై 4.6 తీవ్రతతో నమోదైంది. ఈ భూకంపం భారత కాలమానం ప్రకారం ఉదయం 2:20కి గంటలకు నమోదైనట్లుగా తెలుస్తోంది. అయితే ఆస్తి,
earthquake


కాబుల్, 13 నవంబర్ (హి.స.) అఫ్గానిస్థాన్‌ (Afghanistan)లో మరోసారి భూకంపం సంభవించింది. అయితే, భూ ప్రకంపనలు రిక్టర్ స్కేలు (Richter Scale)పై 4.6 తీవ్రతతో నమోదైంది. ఈ భూకంపం భారత కాలమానం ప్రకారం ఉదయం 2:20కి గంటలకు నమోదైనట్లుగా తెలుస్తోంది. అయితే ఆస్తి, ప్రాణ నష్టంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. కాగా, నవంబర్ 4న ఉత్తర అఫ్గానిస్థాన్ ప్రాంతంలో శక్తివంతమైన భూకంపం సంభవించిన విషయంలో తెలిసిందే. ఈ విపత్తులో సుమారు 27 మంది మరణించగా, 956 మంది గాయపడ్డారని తాలిబాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి షరాఫత్ జమాన్ అమర్ (Sharafat Zaman Amar) తెలిపారు. ఈ భూకంపం దేశంలోని అత్యంత అందమైన మసీదులలో ఒకటిని తీవ్రంగా దెబ్బతీసిందని అంతర్జాతీయ మీడియా (International Media) సైతం కథనాలను ప్రసారం చేసింది. అఫ్గానిస్తాన్ హిందూ కుష్ ప్రాంతంలో ఉన్నందున, భారతీయ-యూరేషియన్ పలకల సంధి కారణంగా అక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తాయి నిపుణులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande