
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
కోల్‌కతా,,,, 15 నవంబర్ (హి.స.): పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో గల ఎజ్రా స్ట్రీట్‌లో శనివారం తెల్లవారుజామున సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 300 దుకాణాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పక్కనే ఉన్న భవనాల్లో నివసిస్తున్న వారిని సకాలంలో ఖాళీ చేయించడంతో ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కోల్‌కతా సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇందిరా ముఖర్జీ ఈ ఘటనను ధృవీకరించారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మంటలను అదుపు చేయడానికి తొలుత ఆరు అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించారు. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో మరో 20 అగ్నిమాపక యంత్రాలను రప్పించాల్సి వచ్చింది. ఎజ్రా స్ట్రీట్‌లోని ఇరుకైన సందుల్లో గల ఎలక్ట్రికల్ వస్తువులు, చెక్క, ప్లైవుడ్ తదితర మండే స్వభావం గల పదార్థాలను నిల్వ చేసే దుకాణాలు, గోడౌన్లలో మంటలు వేగంగా వ్యాపించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ