బీహార్ ఎన్నికల ఎఫెక్ట్.. కాంగ్రెస్- టీఎంసీ పొత్తుకు బ్రేక్..?
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{} ఢిల్లీ 15 నవంబర్ (హి
Rahul Gandhi


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ 15 నవంబర్ (హి.స.)

బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన అఖండ విజయం కోల్‌కతాలో సంచలనం సృష్టించింది. ఈ అంశంపై శుక్రవారం మోడీ మాట్లాడుతూ.. నెక్ట్స్ టార్గెట్ బెంగాల్ అని తెలిపారు. అడవి రాజ్యాన్ని కూల్చివేసినట్లు ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కోల్‌కతా నుంచి కాంగ్రెస్ పార్టీకి చెడు వార్త వచ్చింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశ్యం లేదని టీఎంసీ వర్గాలు ఓ జాతీయ మీడియా సంస్థకు తెలిపినట్లు సమాచారం. తమకు కాంగ్రెస్ పార్టీ అవసరం లేదని వారు స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది! మమతా బెనర్జీ 2026 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తారని టీఎంసీ స్పష్టమైన సంకేతాలు కనబరుస్తుంది.

నిజానికి, జాతీయ స్థాయిలో మమతా బెనర్జీతో కాంగ్రెస్ పొత్తు రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఎప్పుడూ కలవరపెడుతోంది. సోనియా గాంధీతో మమతా బెనర్జీ మంచి సాన్నిహిత్యాన్ని కలిగి ఉండగా.. అధిర్ చౌదరి, అబ్దుల్ మన్నన్ నేతృత్వంలోని బెంగాల్ కాంగ్రెస్ వర్గం.. మమతపై విమర్శలకు దిగేది. తృణమూల్ తమ నాయకులను దూరం చేస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర వర్గం ఎప్పుడూ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పతనానికి తృణమూల్ ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. నిజానికి తృణమూల్‌తో పొత్తు పెట్టుకోవడానికి అధిర్ రంజన్ చౌదరి మొదట్లో సానుకూలంగా లేరు, వామపక్షాలతో కలిసి వెళ్లాలని భావించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande