బిహార్‌లో కాంగ్రెస్‌ కనుమరుగు!!
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;fon
Soniya Gandhi & Rahul Gandhi


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ 15 నవంబర్ (హి.స.)సరిగ్గా 40 ఏళ్ల క్రితం బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 100కుపైగా స్థానాల్లో విజయపతాక ఎగరేసింది. శుక్రవారం వెలువడిన ఎన్నికల్లో కేవలం ఆరు చోట్ల గెలిచింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. 1952 ఎన్నికల్లో 41.38 శాతం ఓట్లను ఒడిసిపట్టిన కాంగ్రెస్‌ ప్రభ 1990వ దశకం నుంచి తగ్గుతూ వస్తోంది. ఈసారి 50కిపైగా స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్‌.. అసదుద్దీన్‌ ఒవైసీ సారథ్యంలోని ఏఐఎంఐఎం, జితన్‌ రామ్‌ మాంఝీ సారథ్యంలోని హిందుస్తానీ అవామ్‌ మోర్చా(హెచ్‌ఏఎం)ల స్థాయికి పడిపోయింది. ఎంఐఎం, హెచ్‌ఏఎంలు చెరో 5 చోట్ల గెలిచాయి.

15 ఏళ్ల క్రితంతో పోలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఓటు షేరు కాస్తంత పెరిగింది. 2010లో పోలైన ఓట్లలో కాంగ్రెస్‌కు 8.17 శాతం ఓట్లు పడితే ఈసారి కాస్తంత ఎక్కువగా 8.75 శాతం ఓట్లు పడ్డాయి. తిరుగుబాటు నేతలను దారి తెచ్చుకోవడం, కీలక నేతల మధ్య సమన్వయం పెంచడం, ఓడిన స్థానాల్లో తిరిగి పట్టుసాధించి విజయం సాధించే క్రమంలో కాంగ్రెస్‌ ఘోరంగా విఫలమవుతోంది. 1985లో వందకుపైగా సీట్లు గెలిచిన పార్టీ తర్వాత 1990లో కేవలం 71 స్థానాలకు పరిమితమైంది. అప్పటి నుంచి గెలుపు కోత మొదలైంది. 1995లో 29 చోట్ల, 2000లో 23 చోట్ల గెలిచింది. ఇక 2005లో పదంటే పది చోట్ల విజయం సాధించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande