
ముంబై, 15 నవంబర్ (హి.స.)దేశీయంగా, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే.ఈ మధ్య కాలంలో పసిడి ధర ఆల్ టైమ్ గరిష్టాల నుంచి 10-15 రోజుల పాటు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక దశలో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4,380 డాలర్లపైన గరిష్ట స్థాయికి చేరగా.. మళ్లీ 400 డాలర్లకుపైగా తగ్గి 4 వేల డాలర్ల స్థాయి దిగువకు కూడా చేరింది. కానీ గత నాలుగైదు రోజుల నుంచి తగ్గుముఖం పడుతుండగా, గత రెండు రోజుల క్రితం ఒక్కసారిగా 2 వేల రూపాయలకుపైగా ఎగబాకింది.
ఇదిలా ఉంటే నిన్న తులం బంగారంపై 800 రూపాయల వరకు తగ్గింది. ఇక నిన్నటికి ఈ రోజు ఉదయం అంటే నవంబర్ 15వరకు తులం బంగారం ధరపై రూ.1500 వరకు తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,030 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే.. కిలో వెండి ధర రూ.1,73,200 వద్ద కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV