
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 15 నవంబర్ (హి.స.)బీహార్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. NDA 200 సీట్లకు పైగా గెలుచుకుని చారిత్రాత్మక విజయం సాధించింది. మహా కూటమి 50 కూడా దాటలేకపోయింది. అయితే.. ఈ ఎన్ని్‌కల్లో కొంతమంది అభ్యర్థులు రికార్డు సంఖ్యలో గెలుపొందారు. మరికొందరు అతి తక్కువ తేడాతో విజయ కేతనం ఎగురవేశారు. బీహార్ ఎన్నికల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో గెలిచిన అభ్యర్థుల జాబితాలో జేడీయూ అభ్యర్థి రామ్‌చరణ్ షా అగ్రస్థానంలో ఉన్నారు. సందేశ్ నియోజకవర్గంలో పోటీ చేసిన రామ్‌చరణ్ కేవలం 27 ఓట్ల తేడాతో గట్టేక్కారు. ఆయనకు వచ్చింది 80,598 ఓట్లు. ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి దీపు సింగ్‌ను 80,571 ఓట్లు వచ్చాయి. ఇద్దరి మధ్య వ్యత్యాసం కేవలం 27 ఓట్లు మాత్రమే.. ఇక్కడ జనసురాజ్ పార్టీకి చెందిన అభ్యర్థి రాజీవ్ రంజన్ రాజ్‌కు సైతం 6,040 ఓట్లు వచ్చాయి.
అదేవిధంగా.. అగియాన్ నియోజకవర్గంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మహేష్ పాశ్వాన్ కేవలం 95 ఓట్ల తేడాతో గెలుపొందారు. 69,412 ఓట్లు సాధించి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) అభ్యర్థి శివ ప్రకాష్ రంజన్‌ను ఓడించారు. అలాగే.. బలరాంపూర్ నియోజకవర్గం ఎల్‌జెపి (రామ్ విలాస్) అభ్యర్థి సంగీతా దేవి.. AIMIM అభ్యర్థి మహ్మద్ ఆదిల్ హుస్సేన్‌పై 389 ఓట్ల తేడాతో గెలుపొందారు. సంగీతా దేవి 80,459 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అభ్యర్థి అరుణ్ కుమార్ భక్తియార్‌పూర్ స్థానంలో 981 ఓట్ల తేడాతో గెలిచారు. 88,520 ఓట్లు సాధించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ