బిహార్‌ ఎన్నికల పాఠాలివే: స్టాలిన్‌ కీలక వ్యాఖ్యలు
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{} చెన్నై , , 15నవంబర్ (
Bihar MK Stalin


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}

చెన్నై , , 15నవంబర్ (హి.స.)

బిహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Results) ఎన్డీయే కూటమి తిరుగులేని విజయం సాధించింది. 202 సీట్లు తన ఖాతాలో వేసుకోగా.. మహాగఠ్‌బంధన్‌ కూటమి తీవ్ర పరాజయం పాలైంది. ఈ ఓటమిపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ (CM MK Stalin) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితంతో ఇండియా కూటమి ఎంతో నేర్చుకోవాలన్నారు.

బిహార్‌ ఎన్నికల ఫలితాలు అందరికీ పాఠమంటూ స్టాలిన్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. నిర్ణయాత్మక విజయం సాధించిన సీఎం నీతీశ్‌కుమార్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో విజయం కోసం అవిశ్రాంతంగా పోరాడిన ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌కు కూడా శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమాలు, సామాజిక, సైద్ధాంతిక సంకీర్ణాలు, స్థిరమైన ప్రచారంపై ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయన్నారు. ఇండియా కూటమి (INDIA alliance)లో అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు ఉన్నారన్నారు. భవిష్యత్తులో వచ్చే కొత్త రాజకీయ సవాళ్లను పరిష్కరించేందుకు వ్యూహాత్మక ప్రణాళిక వేయగలరన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande