జమ్మూ–కాశ్మీర్‌ పోలీస్ స్టేషన్‌లో పేలుడుపై స్థానికుల రియాక్షన్ ఇదే
శ్రీనగర్, 15 నవంబర్ (హి.స.) : శుక్రవారం అర్ధరాత్రి సమయాంలో జమ్మూ, కాశ్మీర్‌లోని నౌగాం పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు (Huge explosion at police station) జరిగి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ‘వైట్ కాలర్’ టెర్రర్ మాడ్యూల్ కేసులో స్వాధీనం చేసుకున్న పేలుడ
this-is-the-reaction-of-locals-to-the-explosion-at-the-jammu-and-kashmir-police-statio


శ్రీనగర్, 15 నవంబర్ (హి.స.) : శుక్రవారం అర్ధరాత్రి సమయాంలో జమ్మూ, కాశ్మీర్‌లోని నౌగాం పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు (Huge explosion at police station) జరిగి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ‘వైట్ కాలర్’ టెర్రర్ మాడ్యూల్ కేసులో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి నమూనాలు తీసే ప్రక్రియలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. అయితే పేలుడు తీవ్రత అధికంగా ఉండటం వల్ల ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 27 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పేలుడు శబ్దం భారీగా ఉండటంతో పరిసర ప్రాంతాలను ఒక్కసారిగా కుదిపేశాయి.

అయితే ఈ భారీ పేలుడు ఘటనపై స్థానికులు మీడియాతో తాము చూసింది చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఓ స్థానికుడు మాట్లాడుతూ..పేలుడు ప్రభావం పరిసర ఇళ్లను కూడా తీవ్రంగా దెబ్బతీశింది. “నా ఇల్లు అక్కడి నుంచి మూడోది. మా ప్రాంతంలో ఎవరైనా పౌరులు గాయపడ్డారా అనే సమాచారం ఇంకా లేదు. అయితే చుట్టుపక్కల ఉన్న అన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి,” అని తెలిపారు. ఘటన స్థలంలో రక్షణ బృందాలు, ఫోరెన్సిక్ టీంలు పనిచేస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి రావాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande