ఎన్టీఆర్ జిల్లాలో తప్పిన పెను ప్రమాదం
విజయవాడ, 16 నవంబర్ (హి.స.) ఎన్టీఆర్ జిల్లాలో (NTR District) పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని నందిగామలో ఉన్న కీసర టోల్ గేట్ (Keesara Toll Gate) వద్ద దాసరి ట్రావెల్స్ కు చెందిన బస్సులో మంటలు చేలరేగాయి. టోల్ గేట్ సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో పరిస్థితి
-major-accident-was-averted-in-ntr-district-494664


విజయవాడ, 16 నవంబర్ (హి.స.) ఎన్టీఆర్ జిల్లాలో (NTR District) పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని నందిగామలో ఉన్న కీసర టోల్ గేట్ (Keesara Toll Gate) వద్ద దాసరి ట్రావెల్స్ కు చెందిన బస్సులో మంటలు చేలరేగాయి. టోల్ గేట్ సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం దాసరి ట్రావెల్స్ కు (Dasari Travels) చెందిన బస్సు హైదరాబాద్ వైపు నుంచి ప్రయాణిస్తోన్న ట్రావెల్స్ బస్సు కీసర టోల్ గేట్ దాటే సమయంలో బస్సు టైర్ల కింద పొగలు రావడాన్ని టోల్ గేట్ సిబ్బంది గమనించారు.

ఎయిర్ పైప్ లీకవ్వడంతో టైర్లు హీటెక్కాయి. పొగలు ఎగజిమ్మడంతో గమనించి టోల్ గేట్ సిబ్బంది వెంటనే బస్సును నిలిపివేశారు. దీంతో ట్రావెల్స్ బస్సు దగ్ధం కాకుండా పెను ప్రమాదం తప్పింది. సిబ్బంది సమయస్ఫూర్తితో ప్రయాణికుల ప్రాణాలు నిలిచాయి. దీంతో టోల్ గేట్ సిబ్బందిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande