సర్కారు.ఆసుపత్రులకు.అందని ఆరోగ్యశ్రీ
అమరావతి, 16 నవంబర్ (హి.స.)ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిలు రావాల్సి ఉండటంతో తరచూ సమ్మెకు దిగుతున్నాయి. ఆ ఆసుపత్రుల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి.. కొంతమేర బకాయిల్ని సర్కారు విడుదల చేస్తోంది. కానీ, సర్కారు ఆసుపత్రులకు మాత్రం పెద్దమొత
సర్కారు.ఆసుపత్రులకు.అందని ఆరోగ్యశ్రీ


అమరావతి, 16 నవంబర్ (హి.స.)ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిలు రావాల్సి ఉండటంతో తరచూ సమ్మెకు దిగుతున్నాయి. ఆ ఆసుపత్రుల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి.. కొంతమేర బకాయిల్ని సర్కారు విడుదల చేస్తోంది. కానీ, సర్కారు ఆసుపత్రులకు మాత్రం పెద్దమొత్తంలో బకాయిలు పేరుకుపోయాయి. ఈ ఏడాది జనవరి తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులకు నిధులు విడుదల కాకపోవడంతో పలు సేవలకు విఘాతం కలుగుతోంది. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రికి తప్ప మిగతా ప్రభుత్వ ఆసుపత్రులకు ‘తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ’ (టీజీఎంఎస్‌ఐడీసీ) ఔషధాలు, వైద్య పరికరాలను సరఫరా చేస్తుంది. బోధనాసుపత్రుల అవసరాల్లో 80% సరఫరా చేస్తుండగా... మిగతా 20% మందులు, పరికరాలను ప్రభుత్వం ఇచ్చే ‘మెడిసిన్‌ బడ్జెట్‌’, ఆరోగ్యశ్రీ పథకంలోని రివాల్వింగ్‌ ఫండ్‌ నుంచి వినియోగించుకోవచ్చు. అయితే మెడిసిన్‌ బడ్జెట్‌ అరకొరగానే అందుతోంది. కనీసం ఆరోగ్యశ్రీ నిధులను వాడుకుందామన్నా ఆ నిధులూ రాక సర్కారు ఆసుపత్రుల్లో రోగులకు ఇబ్బందులు ఎదురవు తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.300 కోట్లకు పైగా బకాయిలు విడుదల కావాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande