చతిస్గడ్ ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి
చతిస్గడ్, 16 నవంబర్ (హి.స.) ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో (Sukma) పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఈ తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు (Maoist) మరణించారు. చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని కరిగుండం అటవీ ప్రాంతంలో మా
మావోయిస్టు


చతిస్గడ్, 16 నవంబర్ (హి.స.)

ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో (Sukma) పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఈ తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు (Maoist) మరణించారు. చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని కరిగుండం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు, గాలింపు బృందాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

ఇప్పటివరకు ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తున్నది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande