
మహబూబాబాద్ 16 నవంబర్ (హి.స.) మహబూబాబాద్ జిల్లా ప్రధాన కేంద్రం మహబూబాబాద్ పట్టణంలోని పత్తిపాక రోడ్డులో ఉన్న ఓ అద్దె భవనంలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న వ్యభిచారం రాకెట్ను టౌన్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడి చేసి రట్టు చేశారు. ఈ దాడిలో ఇద్దరు నిర్వాహకులు, వ్యభిచారంలో పాల్గొంటున్న మరో ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బు కోసం ఈ కార్యకలాపాల్లో పాల్గొంటున్నామని నిందిత మహిళలు అంగీకరించారని టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..