
పాట్నా 16 నవంబర్ (హి.స.)
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
బిహార్ లో గ్రాండ్ విక్టరీ సాధించిన ఎన్డీఏ కూటమి ఈ నెల 19 లేదా 20 తేదీలలో కొలువుదీరే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి మోదీ షెడ్యూల్ అనుగుణంగా తేదీని నిర్ణయించనున్నారు. ఇటీవలే వచ్చిన బిహార్ 18వ అసెంబ్లీ ఫలితాలను ఎన్నికల కమిషన్ ఈ రోజు రాష్ట్ర గవర్నర్ కు సమర్పించనుంది. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మెుదలుకానుంది.
బిహార్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పనులు శరవేగంగా సాగనున్నాయి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ గవర్నర్ కు ఫలితాల నివేదికను అందించనుంది. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన క్యాబినేట్ భేటీ జరగనుంది. అనంతరంనితీష్ తన రాజీనామాను గవర్నర్ కు అందించే అవకాశాలున్నాయి. తరువాత ఎన్డీఏ కూటమి నేతలంతా ప్రత్యేక సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డీఏ కూటమి నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ ప్రమాణ స్వీకార వేడుకకు బిహార్ పాట్నాలోని గాంధీ మైదాన్ వేదిక కానుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ