ఈ నెల 21న హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.) ఈ నెల 21న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు రానున్నారు. శీతాకాల విడిది లో భాగంగా వారి తెలంగాణ షెడ్యూల్ ఖరారు అయింది. ఈ షెడ్యూల్ లో భాగంగా.. ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో 21న మధ్యాహ్నం ప్రెసిడెంట్ ర
రాష్ట్రపతి


హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.)

ఈ నెల 21న భారత రాష్ట్రపతి ద్రౌపది

ముర్ము హైదరాబాద్కు రానున్నారు. శీతాకాల విడిది లో భాగంగా వారి తెలంగాణ షెడ్యూల్ ఖరారు అయింది. ఈ షెడ్యూల్ లో భాగంగా.. ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో 21న మధ్యాహ్నం ప్రెసిడెంట్ రాజ్భవన్ చేరుకుంటారు. సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ఆమె చేరుకొనున్నారు. ఏడాది శీతాకాలంలో రాష్ట్రపతి హైదరాబాద్లో నివసించడం సంప్రదాయం కాగా, ఈసారి కూడా ఆమె రెండు రోజులపాటు నగరంలో ప్రత్యేక పర్యటనను నిర్వహించనున్నారు.

ఈ పర్యటనను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర యంత్రాంగం భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము భారతీయ కళా మహోత్సవంలో పాల్గొని, దేశవ్యాప్తంగా నుండి వచ్చిన కళాకారులను ప్రోత్సహించే అనేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కళా సాంస్కృతిక రంగాన్ని ప్రోత్సహించేందుకు మహోత్సవం ప్రత్యేక వేదికగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande