
ములుగు, 16 నవంబర్ (హి.స.) ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని జవహర్ నగర్ లో ఉన్న మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థులు ఆదివారం ఉదయం ధర్నా నిర్వహించారు. మెనూ ప్రకారం భోజనం అందడం లేదని, నీటి సరఫరా సరిగా లేదని, కరెంటు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా నాలుగు నెలలుగా ఏఎన్ఎం అందుబాటులో లేదని, సెక్యూరిటీ కూడా సరిగా లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ వారు నేడు ధర్నా చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు