ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు దుర్మరణం
జనగామ, 16 నవంబర్ (హి.స.) జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని నిడిగొండ హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిడిగొండ ఫ్లైఓవర్ బ్రిడ్జి పై ఇసుక లారీ పార్క్ చేసి ఉంది. ఇదే క్రమంలో
యాక్సిడెంట్


జనగామ, 16 నవంబర్ (హి.స.) జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని నిడిగొండ హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిడిగొండ ఫ్లైఓవర్ బ్రిడ్జి పై ఇసుక లారీ పార్క్ చేసి ఉంది. ఇదే క్రమంలో ఆర్టీసీ రాజధాని ఎక్స్ప్రెస్ హన్మకొండ నుండి హైదరాబాద్ వెళుతుంది. బ్రిడ్జి సమీపానికి రాగానే ఆగిన లారీని ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ దోమలగూడకు చెందిన పులంపరి ఓం ప్రకాష్ (75), హనుమకొండలోని బాలసముద్రంకు చెందిన నవజీత్ సింగ్ (48) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 16 మంది ప్రయాణికులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్ద చేరుకొని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande