ఈ నెల 17న కేబినెట్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై కీలక చర్చ
హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.) సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 17న అనగా రేపు సోమవారం సాయంత్రం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ (Cabinet meeting) కానుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ జరగనుంది. గిగ్ వర్కర్ల పాల
క్యాబినెట్ బేటి


హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.)

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 17న అనగా రేపు సోమవారం సాయంత్రం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ (Cabinet meeting) కానుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ జరగనుంది. గిగ్ వర్కర్ల పాలసీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ భేటీలో ప్రధానంగా 50 శాతం మించకుండా బీసీలకు పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 24 లోగా ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపాలని హైకోర్టు ఆదేశించగా.. మంత్రివర్గ సమావేశంలో చర్చించి కోర్టుకు తెలిపే అవకాశం ఉంది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande