బెజవాడ బండారు ఎం హెచ్ -65 డీపీఆర్ వివాదం.
అమరావతి, 16 నవంబర్ (హి.స.) - అమరావతి: బెజవాడ-బందరు ఎన్‌హెచ్‌-65 డీపీఆర్‌ వివాదాన్ని అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి ఇటీవల తీసుకువెళ్లారు. తాజాగా ఎన్‌హెచ్, మెట్రో అధికారులు.. ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతో సమావేశమయ్యారు. విజయవాడ ట్
బెజవాడ బండారు ఎం హెచ్ -65 డీపీఆర్  వివాదం.


అమరావతి, 16 నవంబర్ (హి.స.) - అమరావతి: బెజవాడ-బందరు ఎన్‌హెచ్‌-65 డీపీఆర్‌ వివాదాన్ని అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి ఇటీవల తీసుకువెళ్లారు. తాజాగా ఎన్‌హెచ్, మెట్రో అధికారులు.. ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతో సమావేశమయ్యారు. విజయవాడ ట్రాఫిక్‌ సమస్య నేపథ్యంలో బెంజ్‌ సర్కిల్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ మొదలయ్యే చినఓగిరాల వరకు ఒక్క పైవంతెన, అండర్‌పాస్‌ లేకుండా డీపీఆర్‌ తయారు చేశారనే అంశంపై ప్రజాప్రతినిధులు అధికారుల అసంతృప్తిని వివరించారు.

ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి ఆటోనగర్, తాడిగడప, పోరంకి, పెనమలూరు, గంగూరు, ఈడుపుగల్లు కూడళ్లలో ఏర్పడుతున్న ట్రాఫిక్‌ సమస్యల గురించి వివరించారు. ఆయా ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, పై వంతెనలు లేదా బెంజ్‌ సర్కిల్‌ నుంచి అన్ని కూడళ్లు కవర్‌ చేస్తూ డబుల్‌ డెక్కర్‌ పై వంతెన నిర్మించాలని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు అడిగినట్లు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అదే సమయంలో ఓఆర్‌ఆర్, మెట్రో వస్తున్న నేపథ్యాన్ని వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande