సమాజంపై అపూర్వమైన ప్రభావం చూపిన మహనీయుడు : ముఖ్యమంత్రి
అమరావతి, 16 నవంబర్ (హి.స.)ప్రముఖ వ్యాపారవేత్త.. మీడియా దిగ్గజం పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీ రావుకు (Ramoji Rao) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు. రామోజీ రావు జయంతిని (Birth Anniversary) పురస్కరించుకొని ఆయనను స్మరించుక
చంద్రబాబు


అమరావతి, 16 నవంబర్ (హి.స.)ప్రముఖ వ్యాపారవేత్త.. మీడియా దిగ్గజం పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీ రావుకు (Ramoji Rao) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు. రామోజీ రావు జయంతిని (Birth Anniversary) పురస్కరించుకొని ఆయనను స్మరించుకున్నారు. పద్మవిభూషణ్ రామోజీరావు తెలుగు వెలుగు అని కొనియాడారు. నిష్పక్షపాత జర్నలిజానికి నూతన ప్రమాణాలను రామోజీ రావు ఏర్పరిచారని గుర్తు చేసుకున్నారు. ఈనాడు సంస్థల ద్వారా సమాజంపై అపూర్వమైన ప్రభావం చూపిన మహనీయుడని కొనియాడారు. వ్యాపారాల్లో సైతం ప్రజాహితం, విలువలు, నైతికతను ప్రతిష్టించిన అరుదైన దార్శనికులు రామోజీ రావు అన్నారు. రామోజీ రావు జయంతి సందర్భంగా ఆయన చూపిన మార్గాన్ని శాశ్వత స్ఫూర్తిగా మలచుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande