
విశాఖపట్నం, 16 నవంబర్ (హి.స.)
విజయనగరం (Vizianagaram) జిల్లా కొత్తవలస వద్ద థీమ్ బేస్డ్ సిటీ నిర్మిస్తున్నామని రాష్ట్ర మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు. మొత్తం 120 ఎకరాల్లో ఈ థీమ్ బేస్డ్ సిటీ (Theme Based City) నిర్మిస్తున్నారని వెల్లడించారు. విశాఖపట్నం సమగ్ర అభివృద్ధిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విశాఖ మెట్రోపాలిటన్ రీజనల్ అథారిటీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. అధికారులకు పలు సూచనలను చేయడంతోపాటు ఆదేశాలను ఇచ్చారు. అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ను (Bogapuram Airport) కలిపే 7 మాస్టర్ ప్లాన్ రోడ్లను 6 నెలల్లోగా పూర్తి చేయాలన్నారు. విశాఖ మెట్రోపాలిటన్ రీజినల్ అధారిటీ చేపట్టిన 8 ఎంఐజి ప్రాజెక్టుల్లో రోడ్లు,డ్రెయిన్లు, ఇతర మౌలిక వసతుల కల్పన త్వరితగతిన పూర్తి చెయ్యాలని ఆదేశాలిచ్చారు. 50అంతస్తుల ఐకానిక్ భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. జూన్ నెలాఖరులోగా టిడ్కో ఇళ్లు (TIDCO Houses) పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. విశాఖ మాస్టర్ ప్లాన్ (Vishaka Master Plan) డిజైన్ ను నిర్దేశిత గడువు లోగా పూర్తి చేస్తామని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV