
శ్రీనగర్, 16 నవంబర్ (హి.స.)
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
: జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తండ్రి, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మళ్లీ ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో మరో ఆపరేషన్ సింధూర్ జరిగే అవకాశంఉంటుందేమోనని అన్నారు. ఇదే సమయంలో ఇటీవల ఢిల్లీ బాంబు దాడిపై స్పందిస్తూ.. ఆ వైద్యులు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది?. దీనికి కారణం ఏమిటి? అని ప్రశ్నించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
ఇటీవల జరిగిన ఢిల్లీ బాంబు పేలుడు ఘటన, ఫరీదాబాద్‌లో ఉగ్ర సంబంధాలు ఉన్న వైద్యులను అరెస్ట్ చేసిన వ్యవహారంపై మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా తాజాగా స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో దాడి కోసం వైద్యులు ఆ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు?. కారణం ఏమిటి? అనే ప్రశ్నలను బాధ్యులను అడగాలి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి. అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఉగ్రదాడుల నేపథ్యంలో దేశంలో మరో ఆపరేషన్ సిందూర్ వంటి కార్యక్రమం జరగకూడదని ఆశిస్తున్నాను.
ఆపరేషన్ సిందూర్ వల్ల ఏమీ రాలేదు. మనవాళ్లు 18 మంది మరణించారు. రెండు దేశాలు (భారత్, పాకిస్తాన్) తమ సంబంధాలను మెరుగుపరుచుకోవాలని తాను ఆశిస్తున్నాను. అదొక్కటే ఏకైక మార్గమని ఆయన పేర్కొన్నారు.
Sensational comments by Farooq abdullah
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ