ఎన్డీయే గెలుపుపై పీకే సంచలన ఆరోపణలు
పాట్నా 16 నవంబర్ (హి.స.) body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.pf0{} : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఈ
ఎన్డీయే గెలుపుపై పీకే సంచలన ఆరోపణలు


పాట్నా 16 నవంబర్ (హి.స.)

body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నితీష్‌ కుమార్‌ సర్కార్‌పై జన్‌ సూరజ్‌ పార్టీ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహిళలకు రూ.10,000 నగదు బదిలీ చేయడానికి ప్రపంచ బ్యాంకు నిధులను దారి మళ్లించారని అన్నారు. తద్వారా ఇటీవల ముగిసిన ఎన్నికలను ప్రభావితం చేశారని విమర్శలు గుప్పించారు.

జన్‌ సూరజ్‌ పార్టీ నేతలు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీష్‌ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసింది. మహిళలకు రూ.10,000 నగదు బదిలీ చేయడానికి ప్రపంచ బ్యాంకు నిధులను దారి మళ్లించింది. ప్రపంచ బ్యాంకు నుండి వేరే ప్రాజెక్టు కోసం వచ్చిన రూ. 21,000 కోట్ల నుండి ఈ డబ్బును మహిళలు ఇచ్చారు. ఎన్నికల కోసం 14,000 కోట్లు తీసి రాష్ట్రంలోని 1.25 కోట్ల మహిళలకు పంపిణీ చేశారు. ఇతరఅవసరాలకు మరింత డబ్బును ఖర్చు చేశారు. ఇప్పటి వరకు రూ.40 వేల కోట్లను ఎన్డీయే ప్రభుత్వం వెదజల్లిందన్నారు. దీనిపై మా దగ్గర సమాచారం ఉంది. ప్రజా ధనాన్ని ఉపయోగించి ప్రజల ఓట్లను కొనుగోలు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. ఎన్నికలకు ముందు నితీష్ కుమార్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద 1.25 కోట్ల మంది మహిళా ఓటర్ల ఖాతాలకు రూ.10,000 బదిలీ చేసింది. ఈ పథకమే బిహార్‌ ఎన్డీయే తిరిగి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించింది పలు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande