
పాట్నా, 16 నవంబర్ (హి.స.)బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA గెలుపు అనంతరం, మాజీ కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్ (RK Singh)ను “వ్యతిరేక పార్టీ కార్యకలాపాలు” పేరుతో BJP సస్పెండ్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో ఆయన పార్టీపై చేసిన తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో బీజేపీ నుంచి సస్పెండ్ చేయడం తో పాటు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. అయితే మాజీ కేంద్ర మంత్రి అయిన ఆర్ కే సింగ్ మాత్రం ఈ రోజు ఉదయం. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖను పంపించారు. పార్టీ పంపిన సస్పెన్షన్ నోటీసులో ఏయే చర్యలను “వ్యతిరేక కార్యకలాపాలు”గా పరిగణించారో వివరించకపోవడంతో, నిర్దిష్ట ఆరోపణలు లేని పరిస్థితిలో షోకాజ్‌కు సమాధానం ఇవ్వడం సాధ్యం కాదని లేఖలో పేర్కొన్నారు.
నేర కేసులు ఉన్న వారికి పార్టీ టికెట్లు ఇవ్వడం తగదని తాను చేసిన వ్యాఖ్యలే ఈ చర్యకు కారణమై ఉండవచ్చని ఆర్‌కే సింగ్ లేఖలో పేర్కొన్నారు. కాగా గత నెలలో పార్టీ అంతర్గత వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆర్‌కే సింగ్, ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ, జేడీయూ నాయకుడు అనంత్ సింగ్ పై విమర్శలు చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV