
శబరిమల, 16 నవంబర్ (హి.స.)శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. కేరళ రాష్ట్రంలో సరికొత్త వ్యాధి కలకలం రేపుతోందట. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వ ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు నది స్నానం చేసేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. కేరళ రాష్ట్రంలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ ( amoebic meningoencephalitis) కేసులు విపరీతంగా పెరుగుతున్నాయట. ఈ బ్రెయిన్ ఫీవర్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్న నేపద్యంలో ఆరోగ్యశాఖ అలర్ట్ అయింది.
నది స్నానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని అయ్యప్ప భక్తులకు సూచనలు చేసింది. అలాగే వేడి చేసిన నీటిని మాత్రమే తాగాలని పేర్కొంది. తినేముందు చేతులు శుభ్రంగా కడుకోవాలని స్పష్టం చేసింది. ఈ బ్రెయిన్ ఫీవర్లు పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసర సహాయం కోసం 04735 203232 అనే హెల్ప్ లైన్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV