ఆర్ఎస్ఎస్ కార్యకర్తను కాల్చి చంపిన దుండగులు
ఫిరోజ్‌పూర్‌, 16 నవంబర్ (హి.స.) గత కొద్ది రోజులుగా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలో యాక్టీవ్‌గా ఉన్న సంఘ్ కార్యకర్తను దుండగులు తుపాకితో కాల్చి చంపారు. ఈ షాకింగ్ సంఘటన పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో చోటు చేసుకుంది. నిన్న రాత్రి నవీన్ తన పని ముగించుకుని ఇంటికి వె
/rss-activist-shot-dead-by-assailants-in-punjab-494669


ఫిరోజ్‌పూర్‌, 16 నవంబర్ (హి.స.)

గత కొద్ది రోజులుగా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలో యాక్టీవ్‌గా ఉన్న సంఘ్ కార్యకర్తను దుండగులు తుపాకితో కాల్చి చంపారు. ఈ షాకింగ్ సంఘటన పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో చోటు చేసుకుంది. నిన్న రాత్రి నవీన్ తన పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, ఇద్దరు వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దాడి జరిగిన వెంటనే అతను అక్కడికక్కడే మరణించినట్టు అధికారులు నిర్ధారించారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఫిరోజ్‌పూర్ ఎస్‌ఎస్‌పీ భూపిందర్ సింగ్ తెలిపిన ప్రకారం, ఘటనపై పలు ప్రత్యేక బృందాలు దర్యాప్తు నిర్వహిస్తున్నాయి.

సమీప ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించడం, అనుమానితుల కదలికలను ట్రాక్ చేయడం వంటి చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ కేసు కోసం 3–4 ఎస్‌హెచ్‌ఓలు, ఇద్దరు డీఎస్‌పీలు పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. నిందితులను త్వరలోనే గుర్తించి చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande