
నెల్లూరు, 16 నవంబర్ (హి.స.) నెల్లూరు (Nellore) జిల్లా మర్రిపాడు మండలం పరిధిలోని నందవరం (Nandavaram) కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో నెల్లూరు–ముంబై జాతీయ రహదారి పై ఈ ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. వ్యవసాయ కూలీలను తీసుకెళ్తున్న ఆటోను సిమెంట్ ట్యాంకర్ లారీ వెనుక నుండి ఢీకొట్టడంతో ఆటో పూర్తి దెబ్బతింది. ఆటోలో ప్రయాణిస్తున్న పది మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. కాగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలపాలు అయ్యారు. గాయపడిన వారిని 108 సహాయంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు, సిఐ గంగాధర్ , ఎస్సై శ్రీనివాసరావు పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV