వాము ఆకుల్లో ఘాటైన ఔషధ గుణాలు.. ఇంట్లోనే ఇలా పెంచుకోవ‌చ్చు?
కర్నూలు, 17 నవంబర్ (హి.స.)వాము ఆరోగ్యానికి ఎంత మంచిదో.. వాము ఆకులు అంతేకంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో బాడీలో రక్తహీనత దూరమవుతుంది. వీటిని తినడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. అవేంటో తెలుసుకోండి. ప్రకృతిలో మన ఆరోగ్యాన
ూ


కర్నూలు, 17 నవంబర్ (హి.స.)వాము ఆరోగ్యానికి ఎంత మంచిదో.. వాము ఆకులు అంతేకంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో బాడీలో రక్తహీనత దూరమవుతుంది. వీటిని తినడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. అవేంటో తెలుసుకోండి.

ప్రకృతిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ మొక్కలు, మూలికలు అనేకం ఉన్నాయి. కానీ, మనం వాటిని పెద్దగా పట్టించుకోకుండా నిర్లక్షం చేస్తుంటాం. అలాంటి వాటిల్లో వాము ఆకు ఒకటి. ఈ ఆకు వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావని నిపుణులు చెబుతున్నారు. వాము ఆకులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ తదితర ఖనిజాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వాము ఆకు సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు సమస్యలను దూరం చేస్తుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఆకు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

-

వాము ఆకులు ఉష్ణ స్వభావం కలిగినవి. వాతం, కఫాలను తగ్గిస్తాయి. కడుపు నొప్పిని తగ్గించడంలో, జీర్ణాగ్ని వెలిగించడంలో ప్రత్యేకమైన గుణం కలిగినవి! వాము ఆకులు ఘాటైన వగరుతో కూడిన కారపు రుచి కలిగి, మిరప కారానికి సమానంగా వేడిని కలిగిస్తాయి.

-

వాము ఆకులకు అజీర్ణాన్ని తగ్గించే శక్తి ఉంది. అందుకే అజీర్తితో బాధపడే వారు క్రమం తప్పకుండా వాము ఆకులను తింటే ఈ సమస్య తొలగిపోతుంది.

-

వామాకులు శ్వాసకోస సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి. దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలకు వామాకులు మంచి పరిష్కారం అని చెప్పవచ్చు.

-

వాము ఆకులు కడుపులో ఉండే గడ్డలను కరిగిస్తాయి. నులిపురుగులను చంపుతాయి. విషదోషాలు ఏవైనా ఉంటే వాటిని కూడా హరిస్తాయి.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande