
పాట్నా, 17 నవంబర్ (హి.స.)
బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్
కొనసాగుతారని బిహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ప్రకటించారు. 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నితీశ్ కుమార్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 20వ తేదీన పాట్నా గాంధీ మైదాన్ లో నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రకటించారు. అనంతరం నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసి, గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కు రాజీనామా పత్రాన్ని, కేబినెట్ రద్దు తీర్మానాన్ని అందించారు. నితీశ్ కుమార్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యేంతవరకూ నితీశ్ కుమార్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని గవర్నర్ తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు