5 రోజుల్లోనే రూ.5వేలు తగ్గింది.. బంగారం ధరలు ఇంకా పడిపోతాయా..? హైదరాబాద్‌ విజయవాడ, విశాఖపట్నం లో తులం ఎంతుందంటే..
ముంబై, 19 నవంబర్ (హి.స.)ఇటీవల కాలంలో భారీగా పెరిగిన బంగారం ధరలు దిగివస్తున్నాయి.. ఏకంగా లక్షా 30 వేల మార్క్ దాటి పరుగులు పెట్టిన ధరలు.. ఆ తర్వాత 10 వేల వరకు తగ్గాయి.. ఈ క్రమంలోనే.. తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ పెరిగి.. తగ్గుముఖం పట్టాయి..
gold


ముంబై, 19 నవంబర్ (హి.స.)ఇటీవల కాలంలో భారీగా పెరిగిన బంగారం ధరలు దిగివస్తున్నాయి.. ఏకంగా లక్షా 30 వేల మార్క్ దాటి పరుగులు పెట్టిన ధరలు.. ఆ తర్వాత 10 వేల వరకు తగ్గాయి.. ఈ క్రమంలోనే.. తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ పెరిగి.. తగ్గుముఖం పట్టాయి.. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుతుండటంతో దేశీయంగా కూడా ధరలు తగ్గుతున్నాయి.. గత ఐదు రోజుల్లోనే.. బంగారం పది గ్రాములపై రూ.5 వేల వరకు ధర తగ్గింది.. మంగళవారం బంగారం 10 గ్రాములపై రూ.1740 మేర ధర తగ్గగా.. వెండి కిలోపై రూ.5వేల వరకు ధర తగ్గింది. సాయంత్రం వరకు ధరలు స్వల్పంగా తగ్గాయి.. అయితే.. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. పసిడి, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.. వాస్తవానికి బంగారం, వెండి ధరల్లో నిత్యం హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటాయి.. ఒక్కో రోజు బంగారం, వెండి ధర తగ్గితే.. మరికొన్ని రోజులు పెరుగుతూ ఉంటాయి.. తాజాగా. బంగారం, వెండి స్వల్పంగా తగ్గింది. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. బుధవారం (నవంబర్ 19 2025) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.10 మేర ధర తగ్గి రూ.1,23,650 గా ఉంది.

22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.10 మేర ధర తగ్గి రూ.1,13,340 గా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande