
భీమవరం, 20 నవంబర్ (హి.స.)
:lబస్సు ఎక్కుతున్న ప్రయాణికుడి వద్ద ఉన్న రూ.15 లక్షలు విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేసిన దొంగలను భీమవరం ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి వెల్లడించారు. భీమవరానికి చెందిన కణితి ఆంజనేయప్రసాద్ అనే వ్యక్తి ఆభరణాల దుకాణంలో పనిచేస్తున్నారు. ఆయన తయారు చేసిన నగలను నరసాపురంలోని ఓ దుకాణ యజమానికి ఇచ్చేందుకు ఈ నెల 17న భీమవరం బస్టాండ్‌కు వెళ్లారు. బస్సు ఎక్కే క్రమంలో జేబులో ఉన్న నగల సంచిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. చుట్టుపక్కల వెతికినా ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో బాధితుడు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ