రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు : ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ
నాగర్ కర్నూల్, 20 నవంబర్ (హి.స.) నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్ మండలం కొండనాగుల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు
అచ్చంపేట ఎమ్మెల్యే


నాగర్ కర్నూల్, 20 నవంబర్ (హి.స.)

నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట

నియోజకవర్గంలోని బల్మూర్ మండలం కొండనాగుల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. రైతులు పండించే వడ్లను మద్దతు ధరకు కొనుగోలు చేసే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు నష్టం కలగకుండా, లాభాలు వచ్చేలా వారితో సమన్వయం పాటించాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande