
హైదరాబాద్, 20 నవంబర్ (హి.స.)
బీసీల గురించి మాట్లాడే అర్హత కేవలం
బీజేపీకి మాత్రమే ఉందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడం లేదని చెప్పారు. గ్రామాలు వల్లకాడులుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలకు నిధులు వస్తేనే వీధి దీపాల ఏర్పాటు ఇతర కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. రెండేళ్ల నుండి నిధులు రాక అభివృద్ధి కుంటుపడిందన్నారు.
స్థానిక ఎన్నికల్లో పార్టీలతో సంబంధం ఉండదని అన్నారు. గ్రామంలో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేవాళ్లనే గెలిపిస్తారని చెప్పారు. తమకు తెలిసినవాళ్లు, పనిచేసేవాళ్లనే గెలిపించుకుంటామని అన్నారు. సర్పంచ్ లుగా, ఎంపీటీసులుగా నిలబడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ముందుగా గతంలో సర్పంచులుగా పనిచేసినవాళ్ల బిల్లులు క్లియర్ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..