ఆర్టీసీ డ్రైవర్ పై దాడి.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీపీ సజ్జనార్
హైదరాబాద్, 20 నవంబర్ (హి.స.) కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ పై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఘటన పై సీపీ సజ్జనార్ స్పందించారు. ఆర్టీ
CP Sajjanar


హైదరాబాద్, 20 నవంబర్ (హి.స.)

కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్

పై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో ఈ ఘటన చోటు చేసుకోగా..

ఘటన పై సీపీ సజ్జనార్ స్పందించారు. ఆర్టీసీ డ్రైవర్పై దాడి ఘటనపై హైదరాబాద్ సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగులపై దాడులు, బెదిరింపులు, ఆటంకాలు సృష్టించే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బంది సహా ఏ ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణలో ఉన్న సమయంలో వారికి వ్యతిరేకంగా దాడులు జరిపితే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి వాటిని చిన్న ఘటనలుగా తీసుకోకుండా, నేరపూరిత చర్యలుగా పరిగణించి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande