విశాఖపట్నం లో.దారుణం.జరిగింది
అమరావతి, 20 నవంబర్ (హి.స.) విశాఖపట్నంలో దారుణం జరిగింది. ఓ చిన్నారిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణాతిదారుణంగా హతమొందించారు. చిన్నారిని హత్య చేయడంతో పాటు శరీర భాగాలను వేరు చేశారు. కల్వర్టులో చిన్నారి శరీర విడి భాగాలు పడేసి వెళ్లారు. ఉదయం అ
విశాఖపట్నం లో.దారుణం.జరిగింది


అమరావతి, 20 నవంబర్ (హి.స.)

విశాఖపట్నంలో దారుణం జరిగింది. ఓ చిన్నారిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణాతిదారుణంగా హతమొందించారు. చిన్నారిని హత్య చేయడంతో పాటు శరీర భాగాలను వేరు చేశారు. కల్వర్టులో చిన్నారి శరీర విడి భాగాలు పడేసి వెళ్లారు. ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు.. కల్వర్టులో చిన్నారికి సంబంధించిన కాళ్లు, చేతులు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. చిన్నారి శరీర భాగాలను నరికి పడేసినట్లుగా పోలీసులకు సమాచారం అందించారు.

విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని చిన్నారి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు చిన్నారి ఎవరు?.. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేశారా? చిన్నారికి సంబంధించిన మిగిలిన శరీర భాగాలు ఎక్కడ? చిన్నారి హత్యకు కారణం ఏంటి? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కల్వర్టులో చిన్నారి శరీర భాగాలు పడి ఉండటంతో స్థానికంగా కలకలం రేపుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande