దేశవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ చేయండి.. కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి సూచన
హైదరాబాద్, 20 నవంబర్ (హి.స.) దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రేషన్ షాపుల్లో లబ్ధిదారులకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఇవాళ ఉదయం హోటల్ తాజ్ కృష్ణలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్
రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 20 నవంబర్ (హి.స.)

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రేషన్ షాపుల్లో లబ్ధిదారులకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఇవాళ ఉదయం హోటల్ తాజ్ కృష్ణలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రేక్ ఫాస్ట్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో పంపిణీ చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. రేవంత్ రెడ్డి సూచనపై స్పందిచిన ప్రహ్లాద్ జోషి.. పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత పరిశీలించి దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీపై నిర్ణయం తీసుకుంటామన్నారు.ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సివిల్ సప్లయ్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్టీఫెన్ రవీంద్ర, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande