
అమరావతి, 20 నవంబర్ (హి.స.)
మద్దిలపాలెం: విశాఖ మద్దిలపాలెంలోని ఓ కార్ల షోరూమ్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటల ధాటికి 2 కార్లు దగ్ధమయ్యాయి, మరో రెండు కార్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి. నాలుగు ఫైరింజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. మద్దిలపాలెం నుంచి ఇసుకతోటకు వెళ్లే జాతీయ రహదారి సమీపంలో వంశీ ఫంక్షన్ హాల్ కింద ఈ కార్ల షోరూమ్ ఉంది. ఐదంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో విద్యుదాఘాతం కారణంగా ఈ ప్రమాదం జరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ