బేగంపేట విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత.. లాఠీ ఛార్జ్
హైదరాబాద్, 20 నవంబర్ (హి.స.) అక్రమాస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు హాజరయ్యేందుకు నేడు హైదరాబాద్ కు వచ్చాడు. ఈ మేరకు తన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ముందస్తుగానే పిలుపునివ్వడంతో బేగంపేట విమా
లాఠీ ఛార్జ్


హైదరాబాద్, 20 నవంబర్ (హి.స.)

అక్రమాస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం

జగన్ మోహన్ రెడ్డి నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు హాజరయ్యేందుకు నేడు హైదరాబాద్ కు వచ్చాడు. ఈ మేరకు తన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ముందస్తుగానే పిలుపునివ్వడంతో బేగంపేట విమానాశ్రయం వద్దకు వందల సంఖ్యలో వైసీపీ నేతలు, జగన్ అభిమానులు చేరుకున్నారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. అయితే విమానాశ్రయానికి చేరుకోగానే బారికేడ్లను దాటుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గన్ను స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలు „సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande