దేశంలో కుట్రపూరిత రాజకీయాలు.. జాగృతి కవిత
హైదరాబాద్, 20 నవంబర్ (హి.స.) ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్పై చార్జిషీట్ వేసేందుకు గవర్నర్ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కేటీఆర్ సోదరి కవిత స్పందించారు. బీజేపీ వాళ్లకు వాళ్ల మీద వీళ్లమీద కేసులు పెట్టడం తప్ప
జాగృతి కవిత


హైదరాబాద్, 20 నవంబర్ (హి.స.)

ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్పై

చార్జిషీట్ వేసేందుకు గవర్నర్ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కేటీఆర్ సోదరి కవిత స్పందించారు. బీజేపీ వాళ్లకు వాళ్ల మీద వీళ్లమీద కేసులు పెట్టడం తప్ప మరొక పనిలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఏవీ అమలు చేయలేదని వారికి బస్తీల్లో ముఖం చూపించుకునే అంత లేదన్నారు. కాబట్టి ప్రతిపక్షనేతలపై కేసులు పెట్టాలని చూస్తున్నారని చెప్పారు. కానీ ప్రజలు గమణిస్తారని చట్టం, న్యాయం అనేవి ఉన్నాయన్నారు. ఈ దేశంలో కుట్రపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande