బూటకపు ఎన్కౌంటర్లను ఖండిస్తున్నాం: మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, 20 నవంబర్ (హి.స.) ఆపరేషన్ కగారు పేరుతో. కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా మావోయిస్టులను అంతం చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. హిడ్మాతో సహా ఇటీవల జరిగిన బూటకపు ఎన్ కౌంటర్లను ఖండిస్తున్నామన్నారు. ఇవాళ హైదరాబాద్ లో జర
మహేష్ కుమార్


హైదరాబాద్, 20 నవంబర్ (హి.స.)

ఆపరేషన్ కగారు పేరుతో. కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా మావోయిస్టులను అంతం చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. హిడ్మాతో సహా ఇటీవల జరిగిన బూటకపు ఎన్ కౌంటర్లను ఖండిస్తున్నామన్నారు. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ మావోయిస్టులు, భద్రతా దళాలు ఇరువైపుల హింసను ఖండిస్తోందని చెప్పారు. మావోయిస్టులు తుపాకీ పంథా ఎంచుకున్నప్పటికీ వారు కూడా పేద ప్రజల సంక్షేమం కోసమే తమ జీవితాలను త్యాగం చేశారని దీంట్లో ఎలాంటి అనుమానం లేదన్నారు. వారు ఎంచుకున్న మార్గం రాజ్యాంగ ప్రకారం నచ్చకపోవచ్చు కాని వారంతా పేదల కోసమే పని చేస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ ఎన్కౌంటర్లు జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎలిమినేషన్ విధానం ఎంచుకుందని విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande