
కామారెడ్డి, 20 నవంబర్ (హి.స.)
పాత రిజర్వేషన్లకు అనుగుణంగానే
ప్రభుత్వం స్థానిక సంస్థలకు ముందుకు వెళుతుందని మంత్రి సీతక్క అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివారులో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే నెల 11 లోపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలబడవచ్చని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ముందుగా గ్రామ పంచాయతీలకు జరుగుతాయని ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీలకు జరుగుతాయని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందుగా నిర్వహించకపోతే మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులు ల్యాబ్స్ అవుతాయన్న ఉద్దేశంతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు