
హైదరాబాద్, 20 నవంబర్ (హి.స.) రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామ శివారులో సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్పై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తన కారుకు సైడ్ ఇవ్వలేదనే కారణంతో బస్సును వెంబడించి బస్సు డ్రైవర్ బాలరాజ్పై దాడి చేశాడు. ఈ విషయంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. విధుల్లో ఉన్న డ్రైవర్పై దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన ఖండించారు. జిల్లా ఎస్పీ గీతే మహేష్ బాబా సాహెబ్తో మంత్రి ఫోన్లో మాట్లాడి, దాడి ఘటనపై తక్షణం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..