
ఖమ్మం, 20 నవంబర్ (హి.స.)
నడిరోడ్డుపై కట్టుకున్న భార్యను భర్తే
హతమార్చిన భయానక ఘటన ఖమ్మం జిల్లాలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఖమ్మం పట్టణంలోని గట్టయ్య సెంటర్ ప్రాంతంలో భాస్కర్, సాయివాణి దంపతులు కొన్నాళ్లుగా నివాసం ఉంటున్నారు. అయితే, ఇద్దరి మధ్య మనస్పర్దలు వచ్చి ఇటీవలే విడిపోయి వేర్వేరుగా నివసిస్తున్నారు. దీంతో భార్య సాయివాణిపై కోపాన్ని పెంచుకున్న భాస్కర్ ఇవాళ ఉదయం సాయివాణి ఉన్న ఇంట్లోకి వెళ్లి ఆమె పై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో పడి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం అడ్డుకోబోయిన కుమార్తెపై కూడా దాడికి పాల్పడ్డాడు. కాగా స్వల్ప గాయాలతో కుమార్తె తప్పించుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు