
న్యూఢిల్లీ, 20 నవంబర్ (హి.స.)
భారతీయ సైన్యంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల కేసులో ఇవాళ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. 2022 భారత్ జోడో యాత్రలో ఆర్మీపై రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ కేసులో చర్యలు తీసుకోవాలని ట్రయల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణను నిలిపివేయాలని డిసెంబర్ 4వ తేదీ వరకు సుప్రీంకోర్టు స్టేను పొడిగించింది. జస్టిస్ ఎంఎం సుందరేశ్, సతీశ్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ఈ కేసును ఇవాళ విచారించింది. ట్రయల్ కోర్టు ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ మే 29వ తేదీన అలహాబాద్ హైకోర్టును రాహుల్ ఆశ్రయించారు. అయితే ఆ సవాల్ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో రాహుల్ గాంధీ సుప్రీంను ఆశ్రయించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు