పంచాయతీ సెక్రటరీ పై సస్పెన్షన్ వేటు..
ఖమ్మం, 20 నవంబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని లబ్ధిదారులు టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి రేగళ్ల
సస్పెన్షన్


ఖమ్మం, 20 నవంబర్ (హి.స.)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని లబ్ధిదారులు టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి రేగళ్లపాడు పంచాయతీ సెక్రెటరీ శివ మాధవ పై ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన హౌసింగ్ ఎండీ వి.పి.గౌతమ్ విచారణ అధికారిగా హౌసింగ్ పీడీ శ్రీనివాస్ ని నియమించి పూర్తిస్థాయి విచారణ చేపట్టి నివేదిక అందించిన వెంటనే జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు ఇచ్చారు. దీంతో బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ రేగళ్లపాడు సెక్రటరీ శివ మాధవను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande