
ఆసిఫాబాద్, 20 నవంబర్ (హి.స.)
పేకాట స్థావరాల పై దాడి చేసి
ఏడుగురు వ్యక్తుల పై కేసు నమోదు చేసినట్లు ఆసిఫాబాద్ టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆసిఫాబాద్ మండలంలోని ఎల్లారం గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారంతో గురువారం ఉదయం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏడుగురు పేకాట రాయుళ్లు పట్టుబడగా, వారి వద్ద నుంచి రూ. 4,400 నగదు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారి పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు