ప్రభుత్వం పై బురద చల్లే మిల్లర్ల పై కఠిన చర్యలు : చొప్పదండి ఎమ్మెల్యే
జగిత్యాల, 20 నవంబర్ (హి.స.) కొందరు మిల్లర్లు కావాలని ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, వారిని గుర్తించామని, వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హెచ్చరించారు. బుధవారం జగిత్యాల జిల్లా కొడమ్యాల మండలంలోన
చొప్పదండి ఎమ్మెల్యే


జగిత్యాల, 20 నవంబర్ (హి.స.)

కొందరు మిల్లర్లు కావాలని ప్రభుత్వం

పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, వారిని గుర్తించామని, వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హెచ్చరించారు. బుధవారం జగిత్యాల జిల్లా కొడమ్యాల మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలలో వరి కొనుగోలు పై అధికారులు, మిల్లర్లతో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులు పడ్డ ఇబ్బందులను గుర్తు చేస్తూ ధాన్యం రంగు మారినా కొనుగోలు చేయాలని, కోతలు లేకుండా మిల్లర్లు తీసుకోవాలని మిల్లర్లకు స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande