ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలి : సిపిఎం జాన్ వెస్లీ
జనగామ, 20 నవంబర్ (హి.స.) ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. గురువారం జనగామ పట్టణంలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మావోయిస్టులను వచ్చే మార్చిలోపు ఏరి వేస్తామని
సిపిఎం


జనగామ, 20 నవంబర్ (హి.స.)

ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. గురువారం జనగామ పట్టణంలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మావోయిస్టులను వచ్చే మార్చిలోపు ఏరి వేస్తామని స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధం అని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశిస్తే, అమిత్ షా అమలు చేస్తున్నాడని పేర్కొన్నారు. డెడ్ లైన్లు పెట్టి మరీ మావోయిస్టుల ప్రాణాలు తీయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

కేంద్ర ప్రభుత్వం చేస్తున్న బూటకపు ఎన్ కౌంటర్లను ప్రజాస్వామిక వాదులు ఖండించాలని కోరారు. లొంగి పోవడానికి వచ్చిన మావోయిస్టులను కేంద్ర బలగాలు పట్టుకొని కాల్చి చంపుతున్నారని విమర్శించారు. ఏ వ్యక్తిని కూడా చంపే అధికారం ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ లేదన్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు అగ్రనేత తిరుపతిని న్యాయస్థానం ఎదుట ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande