
హైదరాబాద్, 20 నవంబర్ (హి.స.)
ఓ సాధారణ బస్సు కండక్టర్గా ఉన్న వ్యక్తి ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ చేయి పట్టుకుని సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కట్ చేస్తే.. 'తలైవా'గా దేశమంతా ఆరాధించే రజనీకాంత్గా మారి సినీ ఇండస్ట్రీని ఏలేశాడు. చలనచిత్ర రంగంలోకి వచ్చి అర్ధ శతాబ్దం తర్వాత కూడా ఆయన స్టైల్, ఎనర్జీ, మాస్ అప్పీల్కు ఏ మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలోనే రజనీకాంత్ సినీ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో ప్రముఖ ఆంగ్ల పత్రిక 'హిందుస్తాన్ టైమ్స్' తమ ఫ్రంట్పేజీలో రజనీ ఫోటోతో పాటు మాస్టర్ హెడ్ను మారుస్తూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అయితే, వందేళ్ల చరిత్రలో తొలిసారి ఒక హీరో ఫోటోను ప్రింట్ చేసిన పత్రికగా హిందుస్తాన్ టైమ్స్ నిలిచింది. ---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..